ఎం ధర్మరాజు ఎం ఏ సీక్వెల్ లో మోహన్ బాబు ?

Saturday, October 21st, 2017, 11:11:02 AM IST

మోహన్ బాబు అప్పట్లో రెండు పాత్రలో నటించిన ఎం ధర్మరాజు ఎం ఏ సినిమా గుర్తుందిగా .. తమిళంలో సత్యరాజ్ నటించిన ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రీమేక్ చేసాడు మోహన్ బాబు. ఈ సినిమా అటు కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు మోహన్ బాబుకు మంచి పేరొచ్చింది. దుర్మార్గుడైన రాజకీయ నాయకుడిగా, తల్లిని పోగొట్టుకుని తండ్రి పై పగ తీర్చుకునే పాత్రలో నటించాడు మోహన్ బాబు. ప్రస్తుతం గాయత్రీ సినిమాలో నటిస్తున్న మోహన్ బాబు ఎం ధర్మరాజు ఎం ఏ సినిమాకు సీక్వెల్ గా ఇది రూపొందుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గాయత్రీ సినిమా అదే ఛాయల్లో ఉంటుందని అంటున్నారు. ఇందులో మోహన్ బాబు రెండు పాత్రల్లో నటిస్తున్నాడట. మొత్తానికి మళ్ళీ ఈ సినిమాతో మోహన్ బాబు తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడన్నమాట.

  •  
  •  
  •  
  •  

Comments