ప్రధానమంత్రి గా మోహన్ లాల్ ?

Wednesday, October 10th, 2018, 11:46:30 AM IST

ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రధాని పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కనిపిస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరాల్ గా మారాయి. సూర్య హీరోగా నటిస్తున్న 37వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్ర లో కనిపిస్తాడట. ఇందులో సూర్య ప్రధాని బాడీ గార్డ్ గా నటిస్తున్నాడు. మోహన్ లాల్ ప్రధాని మోడీ లుక్ లో పోలి ఉండడంతోనే ఆయనను ఈ పాత్రలో నటింప చేస్తున్నారు. ఇందులో ఆర్య కూడా మరో కీ రోల్ చేస్తున్నాడు. నిజానికి ఈ పాత్రకోసం ముందు అల్లు శిరీష్ ని అడిగారట, తాను చేయడానికి ఓకే చెప్పాడు .. కానీ ఆ తరువాత ఎందుకో తప్పుకోవడంతో ఆ పాత్రలో ఆర్య నటిస్తున్నాడు. ఎంజికె పేరుతొ తెరకెక్కే ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తారట.