`ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లో మోక్ష‌జ్ఞ లేడు!?

Saturday, September 8th, 2018, 09:27:01 PM IST

`ఎన్టీఆర్` బ‌యోపిక్ లో ఒక్కో పాత్ర‌ రివీల్ చేస్తున్నా… బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ నటిస్తున్నాడా? లేదా? అన్న‌ది ఇప్ప‌టికీ స‌రైన క్లారిటీ లేదు, ఎన్టీఆర్ మ‌న‌వ‌డు మోక్షజ్ఞ‌ కి ఎన్టీఆర్ క‌న్నా గొప్ప లాంచింగ్ చిత్రం ఉంటుందా? అంటూ ఓవైపు అభిమానుల్లో ముచ్చ‌ట సాగుతోంది. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల మోక్ష‌జ్ఞ రోల్ ఏంటో రివీల్ చేస్తార‌ని అభిమానులు ఆశ‌గా ఎదురు చూశారు. మోక్షు బ‌ర్త్ డే రోజు లాంచ్ చేస్తార‌ని భావించినా అస‌లు ఏ విష‌య‌మూ చెప్ప‌నేలేదు. దీంతో అస‌లు మోక్ష‌జ్ఞ న‌టిస్తున్నాడా.. లేదా? అన్న సందేహాలు క‌లిగాయి.

హ‌రికృష్ణ ఆక‌స్మిక మ‌ర‌ణం అనంత‌రం ఏ కార్య‌క్ర‌మంలోనూ ఫ్యామిలీ స‌భ్యులు క‌నిపించినా ఎక్క‌డా మోక్షజ్ఞ‌ మాత్రం కనిపించలేదు. ఒక‌వేళ సినిమాలో న‌టిస్తూ స్థానికంగా ఉండి ఉంటే.. క‌నీసం లీక్డ్ స్టిల్స్ అయినా బ‌య‌ట‌కు వ‌చ్చేవి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ చిత్రం 30 శాతం షూటింగ్ కూడా పూర్త‌యింది. స‌న్నిహితులు, పీఆర్ ఓ ల‌నుంచి కూడా ఎలాంటి లీక్‌లు అంద‌క‌పోవ‌డంతో అస‌లు మోక్ష‌జ్ఞ ఈ చిత్రంలో న‌టిస్తున్నాడా.. లేదా? అన్న సందేహాలు ఇంకా రాజుకుపోతున్నాయి. ఎన్టీఆర్ టీనేజీ పాత్ర‌లో మోక్ష‌జ్ఞ నటిస్తున్నాడు అన్న ప్ర‌చారం అయితే సాగింది కానీ, దాని సింప్ట‌మ్ ఒక్క‌టీ క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనిపై క్రిష్, బాల‌య్యల్లో ఎవ‌రో ఒక‌రు క్లారిటీ ఇస్తే గానీ.. జ‌నాల సందేహం తీర‌దు. ఇప్ప‌టికే మోక్ష‌జ్ఞ యాక్టింగ్ కోర్స్ చేసి రెడీగా ఉన్నాడు. చ‌దువు పూర్తి చేసుకుని డ్యాన్సులు, ఫైట్స్‌లోనూ త‌ర్ఫీదు పొందాడు. మ‌రి న‌టిస్తున్నాడా.. లేదా ఇంత‌కీ?

  •  
  •  
  •  
  •  

Comments