న‌ట‌సింహా వార‌సుడు ఎంట్రీ మూవీ తెలిస్తే షాకే!

Saturday, February 24th, 2018, 08:54:44 PM IST

నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? ఇటీవ‌లి కాలంలో దీనికి సంబంధించిన ఏ అప్‌డేట్ లేనేలేదు. దీంతో నంద‌మూరి అభిమానులు కాస్త నిరాశ‌తోనే ఉన్నారు. ఫ్యాన్స్‌ మోక్షు రాక కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. వాస్త‌వానికి 2017లోనే మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని భావించినా ఎందుక‌నో వీలుప‌డ‌లేదు. అయితే ఈ ఏడాది ష్యూర్‌షాట్‌గా మోక్షజ్ఞ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని సంకేతాలు అందుతున్నాయి. మోక్ష‌జ్ఞ కోసం ఇప్ప‌టికే బాల‌య్య చాలా సీరియ‌స్‌గా స‌న్నాహాలు చేస్తున్నారు.

ఆ క్ర‌మంలోనే మ‌రాఠీ బ్లాక్‌బ‌స్ట‌ర్ `సైరాట్‌` రీమేక్ హ‌క్కుల్ని ఛేజిక్కించుకున్నార‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ సినిమా రీమేక్ హ‌క్కులు రాక్ లైన్ వెంక‌టేష్ వ‌ద్ద ఉండేవి. తెలుగు, త‌మిళ్‌లో సినిమాని రీమేక్ చేసేందుకు రాక్ లైన్ ప్లాన్ చేశారు. కానీ నంద‌మూరి కాంపౌండ్ మోక్ష‌జ్ఞ కోసం ఆ సినిమా రీమేక్ హ‌క్కులు ఛేజిక్కించుకుందిట‌. కేవ‌లం నాలుగు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి 100 కోట్లు పైగా వ‌సూలు చేసిన సినిమా సైరాట్‌. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రీమేక‌వుతోంది. ఈ చిత్రంతోనే శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ తెరంగేట్రం చేస్తోంది. షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇంత‌టి క్రేజు ఉన్న మూవీ కాబ‌ట్టే, బాల‌య్య‌బాబు సీరియ‌స్‌గా ఆలోచించి, ఈ సినిమాతో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇస్తే బావుంటుంద‌ని ఫిక్స‌య్యార‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. ఇక మోక్షు మొద‌టి సినిమా సెట్స్‌కెళ్లేందుకు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.