2017లో మోక్షజ్ఞ ఎంట్రీ.. క్యూలో ఆ న‌లుగురు?

Tuesday, December 27th, 2016, 03:44:02 PM IST

mokshagna
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న కెరీర్ కీల‌క‌చిత్రం -గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో న‌టించారు. ఇది 100వ సినిమాగా రిలీజ‌వుతోంది. అయితే త‌దుప‌రి బాల‌య్యకు మ‌రో కీల‌క‌బాధ్య‌త ఉంది. త‌న న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ‌ను విజ‌య‌వంతంగా లాంచ్ చేయ‌డం. ప్ర‌స్తుతం ఈ విష‌యంపైనే బాల‌య్య దృష్టి సారించేందుకు రెడీ అవుతున్నారు,

ఇక వందో సినిమా 2017 సంక్రాంతికి రిలీజ్ అయిపోగానే త‌న‌యుడి సినిమా గురించి ఆలోచించ‌నున్నారుట‌. మోక్షు ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో శిక్ష‌ణ‌తో ఆరితేరి ఉన్నాడు. ఫైట్స్‌, డ్యాన్సుల్లో పూర్తి స్థాయి త‌ర్ఫీదు పొందాడు. 2017లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప‌క్కాగా ప్రిపేరై ఉన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే లెజెండ్ నిర్మాత వారాహిచల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి లావుపాటి బ‌డ్జెట్ ప‌ట్టుకుని రెడీగా ఉన్నారుట‌. మోక్షు డేట్స్ లాక్ చేసుకుని, ఎట్టిప‌రిస్థితిలో తానే లాంచ్ చేస్తాన‌ని కొర్ర‌పాటి బాల‌య్య‌ను కోరారుట‌. ఇక పూరి జ‌గ‌న్నాథ్‌, త్రివిక్ర‌మ్‌, క్రిష్‌, బోయ‌పాటి ద‌ర్శ‌కులుగా రేసులో ఉన్నారు. వీళ్ల‌లో ఎవ‌రు ఫైన‌ల్ అవుతారు? అన్న‌ది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments