సినిమాల్లో మాంటేజెస్‌.. ఈయ‌నే సృష్టిక‌ర్త‌!!

Monday, January 22nd, 2018, 10:00:02 PM IST

సినిమా మొత్తం ఒకెత్తు అయితే, ఆ సినిమాలో మాంటేజెస్ మ‌రో ఎత్తు! మాంటేజ్ షాట్స్‌కి అంత గొప్ప ప్ర‌త్యేక‌త ఉంటుంది. స‌న్నివేశం ఏదైనా అందులో ఎమోష‌న్ స్థాయిని పెంచే కెపాసిటీ మాంటేజ్ షాట్స్‌కే ఉంటుంది. అందుకే ఆయా స‌న్నివేశాల్లో మాంటేజ్ షాట్స్ కోసం ప్ర‌త్యేకించి రూప‌క‌ల్ప‌న చేస్తుంటారు ద‌ర్శ‌కుడు. అయితే అస‌లు ఈ మాంటేజెస్ క‌నిపెట్టిన మొట్ట‌మొద‌టి ఫిలింమేక‌ర్ ఎవ‌రు? అంటే .. ఇన్నాళ్లు అంత క్లారిటీ లేదు.

నేడు గూగుల్ డూడుల్ లైవ్‌లో క‌నిపించిన ఫోటో ఆ మ‌హానుభావుడిదే. ఆయ‌న పేరు సెర్గీ ఈన్‌స్టీన్స్. సోవియెట్ (ర‌ష్య‌న్) ఫిలింమేక‌ర్‌. ర‌ష్యాలో సినిమా ఆరంభంలోనే ఆయ‌న ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. ఆరంభం థియేట‌ర్‌లో ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసి, అటుపై సినిమా ప్ర‌పంచంలో అడుగుపెట్టాడు. అలా1925లో `బ్యాటిల్‌షిప్ పోథెంకిన్‌` అనే యుద్ధ నేప‌థ్య సినిమా తెర‌కెక్కించాడు. స్వ‌త‌హాగా అత‌డు బోస్లెవిక్ విప్ల‌వ‌కారుల్లో ఒక‌డు కాబ‌ట్టి వార్ బ్యాక్‌డ్రాప్ సినిమాని గొప్ప‌గా పండించాడు. ఆ చిత్రంలోనే అత‌డు తొలిసారి మాంటేజ్ షాట్స్ ఉప‌యోగించాడు. ప్ర‌పంచ సినిమా హిస్ట‌రీలో ఈ చిత్రం ఓ మాష్ట‌ర్ పీస్‌గా గుర్తింపు పొందింది ఈ సినిమా. ఆర్కిటెక్ట్ ఫ్యామిలీలో జ‌న్మించిన సెర్గీ సినిమా, థియేట‌ర్ రంగంలో సుప్ర‌సిద్ధుడిగా వెలిగిపోయాడు. ఈరోజు సెర్గీ 120వ జ‌యంతి సంద‌ర్భంగా గూగుల్ డూడుల్ ఆయ‌న ఫోటోని లైవ్ చేసింది. ప్ర‌స్తుతం హాలీవుడ్ .. బాలీవుడ్‌.. టాలీవుడ్‌.. ప‌రిశ్ర‌మ ఏదైనా మాంటేజెస్ లేని సినిమా లేదు. అదంతా సెర్గీ చూపించిన దారి అని చెప్పొచ్చు.