చంద్రుడిపై నడవాలనుందా.. అయితే ఈ షూస్ కొనుక్కోండి

Monday, February 8th, 2016, 05:44:21 PM IST


ఆకాశంలోకి చూసిన ప్రతిసారి ప్రతిఒక్కరికీ అక్కడ కనబడే చంద్రుడిపై నడవాలని ఉంటుంది. చంద్రుడిపై తక్కువ గురుత్వాకర్షణలో నడుస్తున్నట్లు.. గాలిలో తేలిపోతున్నట్లు కాసేపు ఊహించుకుని వెంటనే తేరుకుని అబ్బే అదంతా సాధ్యమయ్యే పనికాదులే అనుకుంటూ వాస్తవంలోకోచ్చేస్తారు. అలాంటివారి కోసమే అమెరికాకు చెందిన ఓ కొత్త స్టార్టప్ కంపెనీ కొత్తరకం షూలను రూపొందించింది. ఈ షూస్ వేసుకుని నడిస్తే అచ్చు చంద్రుడిపై నడుస్తున్నట్లు.. గాలిలో తేలుతున్నట్లు ఉంటుంది.

వీటి పేరు ‘ 20: 16 మూన్ వాకర్’. ఈ షూల అడుగు భాగాన N45 నియోడిమియం ఆయస్కాంతాలను అమరుస్తారు. ఇవి శక్తి క్షేత్రాన్ని సృష్టించి షూ వేసుకున్న వారి పాదాలపై తక్కువ బరువు ఉండేలా చేస్తుంది. వీటిని నియోడిమియం, ఐరన్, బోరాన్ మిశ్రామాలతో తయారు చేస్తారు. ముందుగా ఒక పొరపై 12 నుండి 13 ఆయస్కాంతాలను అమర్చి దానికి వ్యతిరేక దిశలో ఇంకో పొరపై మరో 12 నుండి 13 ఆయస్కాంతాలను అమరుస్తారు. ఈ పొరల మధ్య సృష్టించబడే వ్యతిరేక శక్తి పాదాలను పైకి తోస్తూ గాలిలో తేలిన అనుభూతిని కలిగిస్తాయి. ఈ అయస్కాంతాలు 183 కిలోల బరువు వరకూ మోయగలవు. వీటి ధర కూడా అందుబాటులోనే ఉంటుందని వీటి తయారీదారుడు జ్రైజిరి తెలిపారు.