కొత్త సచివాలయం డిజైన్‌లో మరిన్ని మార్పులు..!

Thursday, July 30th, 2020, 11:56:58 AM IST

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులు దాదాపుగా పూర్తయిన నేపధ్యంలో కొత్త సచివాలయం డిజైన్‌లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నమూనాలో మరికొన్ని మార్పులు చేశారు.

అయితే గతంలో సచివాలయ నమూనాలో మార్పులు సూచించిన సీఎం కేసీఆర్ తాజాగా మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్‌లు కూడా అన్ని సౌకర్యాలతో ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి అంతస్తులో డైనింగ్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాల్‌, అన్ని వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా డిజైన్ ఖరారైతే టెండర్లను పిలిచి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.