పాపం అతగాడికి దెబ్బకి విక్రమ్ బలయ్యాడు ?

Sunday, September 23rd, 2018, 01:23:16 AM IST

అనుకున్నవన్నీ జరగవు .. అనుకోలేదని ఆగవు కొన్ని అన్నాడో సినీ కవి. నిజమే .. మనం ప్లాన్ చేసినవన్నీ జరిగితే .. లైఫ్ బోర్ కొట్టదు. ఇప్పుడు అలాగే ఉంది హీరో విక్రమ్ పరిస్థితి ? శంకర్ దర్శకత్వంలో ఐ సినిమా భారీ ప్లాప్ తరువాత హీరో విక్రమ్ కు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా లాభం లేకపోయింది. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సామి 2 ( తెలుగులో సామీ ) సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. పదేళ్ల క్రితం విక్రమ్ – హరి దర్శకత్వంలో వచ్చిన సామి సంచలన విజయం అందుకుంది. ఆ సినిమాతో విక్రమ్ మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే సామి సినిమాకు సీక్వెల్ చేయాలనీ ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు హరి. తాజాగా వచ్చిన సామి2 సినిమా అప్పటి సామి సినిమాకు ఎలాంటి పోలికలు లేవు .. అసలు ఈ సినిమాలో కథే లేదని జనాలు చెబుతున్నారు. మరి గుడ్డిగా వీరత్వం మాస్ చూపిస్తే జనాలు చూసేస్తారని దర్శకుడు నమ్మకమే ఈ సినిమాను దెబ్బ కొట్టింది. నిజానికి ఇది సామి సీక్వెల్ కాదు .. హరి దర్శకతంలో సూర్య హీరోగా వచ్చిన సింగం సినిమా సీక్వెల్ అనుకోవాలి .. సింగం సూపర్ హిట్ అవ్వడంతో సింగం 2 చేసారు అది బాగా ఆడింది కాబట్టి ఈ మద్యే సింగం 3 తీస్తే అది పెద్ద దెబ్బ కొట్టింది. అయినా సరే హీరో మళ్ళీ సూర్య తో సింగం 4 ప్లాన్ చేసాడు .. ఈ సినిమాను సూర్య నో చెప్పడంతో అది విక్రమ్ దగ్గరికి వచ్చింది. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న విక్రమ్ ఈ సినిమాను ఒప్పుకోవడం ఇలా దెబ్బ పడడం అన్ని జరిగాయి. మొత్తానికి సూర్య సేఫ్ అయ్యాడు .. విక్రమ్ కు దెబ్బ పడింది.