అందగత్తెలకే అందగత్తెలు ఈ ఊర్లో ఉన్నారు

Thursday, September 29th, 2016, 03:33:45 PM IST

smart
అందం – డబ్బు తరవాత ప్రపంచాన్ని ఆకర్షించే పదం ఇంకేదైనా ఉందా అంటే అది ఇదే. అందం అనే మాట వినగానే ముందర మనసులో మెదిలే రూపం స్త్రీ దే. ఎన్నో ప్రదేశాలు,ఎన్నో వస్తువులు అందంగా అనిపించినా కూడా అందం అంటే మనకి కేర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అమ్మాయి. అందానికి నిర్వచనంగా ఆడపిల్లని చూపిస్తారు. కొందరి అందం చూపుని తిప్పుకునే ఛాన్స్ కూడా ఇవ్వడు , చూస్తూ ఉండిపోవాలి అనిపించేంత అందంగా ఉంటారు కొందరు. మరి ప్రపంచంలో అందరికంటే అందంగా ఉండే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు ? అందానికే అందంగా ఉండే అందగత్తెలు ఎక్కడ ఉంటారు ? ఈ విషయం తెలుసుకున్నారు కొందరు అపర మేధావులు. దేశ దేశాలు అన్నీ గాలించి మరీ హాటెస్ట్ లేడీ కి కేరాఫ్ అడ్రస్ గా కొన్ని నగరాల జాబితా సిద్దం చేసారు కూడా. హాటెస్ట్ అందాలకి చిరునామాగా మొదట మిలాన్ నగరం కనిపిస్తుంది అంటున్నారు. ఇటలీలో ఉండే ఈ ప్రాంతం ఫాషన్ కి పెట్టంది పేరు. మిలాన్ లో ఎక్కడ చూసినా మోడల్సూ ట్రెండీ డ్రెస్సుల వేసుకున్న అమ్మాయిలతో నగరం కళకళలాడుతూ ఉంటుంది , అయితే ఇక్కడ అందగత్తెలు కేవలం ఫాషన్ వైపు మొగ్గు చూపుతూ సిగ్గులు ఒలికించే భామలు మాత్రం కానే కాదు . మోడలింగ్ లో కూడా అడుగుపెట్టని, అటువైపు ఆసక్తి కూడా చూపించని వనితలే ఎక్కువగా అందంగా ఉంటారు అని ఈ సర్వే చెబుతోంది మరి.

  •  
  •  
  •  
  •  

Comments