శ్రీను వైట్లను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారట ?

Monday, October 30th, 2017, 04:44:17 PM IST

అప్పట్లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న శ్రీను వైట్ల కు వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. దాంతో అవకాశాలు బాగా తగ్గాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన మిస్టర్ సినిమా భారీ పరాజయం పాలవడంతో శ్రీను వైట్లకు నెక్స్ట్ సినిమాకు అవకాశం ఇచ్చేవారు కరువయ్యారు. తాజాగా ఆయనకు రవితేజ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా నిర్మించేందుకు మైత్రి మూవీస్ సన్నాహాలు మొదలు పెట్టింది. అయితే ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు ఇంకాస్త టైం పట్టేలా ఉందట !! దానికి కారణం .. ప్రస్తుతం రామ్ చరణ్ – సుకుమార్ ల కాంబినేషన్ లో రంగస్థలం 1985 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు, దాంతో పాటు నాగ చైతన్య – చందు మొండేటి దర్శకత్వంలో రూపొందే సినిమా కూడా లైన్ లో ఉంది, కాబట్టి ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే శ్రీను వైట్ల సినిమా సెట్స్ పైకి వస్తుందని చెప్పారట .. దాంతో శ్రీను వైట్ల వైటింగ్ లిస్ట్ లో ఉండిపోయాడు. అది విషయం.