మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్ ‘స‌య్య‌ద్ జ‌కీర్పై’ సిట్ నివేదిక‌!

Wednesday, January 25th, 2017, 11:02:52 AM IST

arrest1
హైద‌రాబాద్‌కి చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్‌ స‌య్య‌ద్ జ‌కీర్ గురించిన ఇంట్రెస్టింగ్ విష‌యాలెన్నో సిట్ ద‌ర్యాప్తులో తెలుస్తున్నాయ్‌. సామాన్యుడిలా తిరిగే స‌య్య‌ద్ అత్యంత ప్ర‌మాద‌కారి అని సిట్ అధికారులు నిర్ధారించారు. ఉగ్ర మూక‌ల నాయ‌కుడు జ‌కీర్ నాయ‌క్‌తో హైదరాబాదీ అయిన స‌య్య‌ద్ జ‌కీర్‌కి స‌త్సంబాంధాలున్నాయి. ఆయ‌న్ని ప‌లుమార్లు ఈయ‌న‌ క‌లుసుకున్నాడు. స‌య్య‌ద్ జ‌కీర్ ల‌ష్క‌రే తోయిబా తీవ్ర‌వాది. సౌదీలో ఉండేవాడు. అప్ప‌ట్లో బీజేపీ మ‌ల‌క్‌పేట‌ నేత ఇంద్ర సేనారెడ్డిపై హ‌త్యాయ‌త్నం చేశాడు. అటుపై రియాద్ పారిపోయాడు. ఆ టైమ్‌లోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇటీవ‌లే సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. 8 నెల‌ల త‌ర్వాత బ‌ల‌వంతంగా ఇండియా పంపేశారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ వ‌స్తూ పోతూ తీవ్ర‌వాద కార్య‌క‌లాపాలు న‌డిపిస్తున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల్ని స‌య్య‌ద్ ఎదుర్కొంటున్నాడు.

సిట్ అధికారులు విచార‌ణ‌లో నిగ్గు తేలుతున్న ఒక్కో నిజం క‌ళ్లు భైర్లు క‌మ్మేలా చేస్తున్నాయి. స‌య్య‌ద్ జ‌కీర్ హైద‌రాబాద్‌లోనే యూత్‌ని చెడ‌గొడుతూ ఐఎస్ఐఎస్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాడు. యువ‌త‌ను ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్లిస్తున్నాడ‌ని సిట్ అధికారులు నిర్ధారించారు. రిప‌బ్లిక్‌డే సంద‌ర్భంగా అత‌డు పేలుళ్ల‌కు కుట్ర ప‌న్నాడ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఇంకా అత‌డిపై విచార‌ణ సాగుతోంది.