మోషన్ పోస్టర్ : అదుర్స్ అనిపించిన ‘అరవింద సమేత’ వీర రాఘవ

Sunday, May 20th, 2018, 03:06:37 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన పుట్టిన రోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆయన #NTR 28 లుక్ ను హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిన్న సాయంత్రం అధికారికంగా విడుదల చేసింది. కాగా ఆ చిత్రానికి ‘అరవింద సమేత’ వీర రాఘవ అనే టైటిల్ ని నిర్ణయించారు. విడులయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో వున్న ఆ లుక్ కి అయన ఫాన్స్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయి కామెంట్స్ చేస్తున్నారు. ఎస్ రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా నిన్న ఫస్ట్ లుక్ విడుదల చేసిన యూనిట్ నేడు మోషన్ పోస్టర్ విడుదల చేసింది.

ఇందులో ఎన్టీఆర్, పూజలు ఒక గోడ మీద కూర్చుని వున్న సీన్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. థమన్ ఈ పోస్టర్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అజ్ఞాతవాసి తో కెరీర్ లో అతి పెద్ద ప్లాప్ ని చవిచూసిన మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ చూడబోతే ఈ చిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి కసితో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి జోష్ మీద వున్నాడు. మరి వీరిద్దరూ కంబినేషన్లో త్వరలో రానున్న ఈ అరవింద సమేత చిత్రం రేపు విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు అందుకుంటుందో వేచి చూడాలి……

  •  
  •  
  •  
  •  

Comments