ఐసీయూ లో చికిత్స పొందుతున్న మోత్కుపల్లి

Sunday, April 18th, 2021, 01:59:07 PM IST


బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రి లో ఐసీయూ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆయన, నిన్న రాత్రి ఆరోగ్యం క్షీణించడం తో ఐసీయూ లో చేరినట్లు తెలుస్తోంది. అయితే వైద్యులు సైతం ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్తితి ను వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.అయితే కరోనా వైరస్ ఉదృతి రాష్ట్రం లో ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యం లో అవసరం ఉంటేనే తప్ప బయటికి రావొద్దు అంటూ నిపుణులు సూచిస్తున్నారు.