మూవీ ట్రేడ్ టాక్ : ఇండస్ట్రీ హిట్ దిశగా ‘రంగస్థలం’

Friday, April 6th, 2018, 06:12:02 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన కొత్త సినిమా రంగస్థలం. విడుదలయిన తొలి రోజునుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.130 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు చెపుతున్నారు. కేవలం 7 రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తొమ్మిదో తెలుగు చిత్రంగా నిలిచింది. అంతేకాదు ‘రంగస్థలం’.. అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ సినిమా మొత్తం వసూళ్లను కూడా బీట్‌ చేసింది. బన్నీ సినిమా మొత్తం రూ.115 కోట్లు వసూలు చేసింది.

రెండో వారంలో మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, పవన్‌కల్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’ సినిమాల వసూళ్లను కూడా అధిగమించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలానే మరోవైపు ఓవర్సీస్ లోను ఈ సినిమా ఇప్పటికే 2.5 మిలియన్ డాల్లర్లను అందుకుంది. చూడబోతే అక్కడ నాన్ బాహుబలి రికార్డుగా వున్నా శ్రీమంతుడు కలెక్షన్ 2.8 మిలియన్లను బీట్ చేసి 3 మిలియన్లకు చేరే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడబోతే రాంచరణ్ మగధీర తర్వాత, ప్రస్తుతం రంగస్థలంతో మరోమారు ఇండస్ట్రీ హిట్ అందుకునేలా వున్నాడు…..

  •  
  •  
  •  
  •  

Comments