సినిమాలే జీవితం కాదంటున్న శృతి హాసన్ ?

Wednesday, February 14th, 2018, 09:42:32 AM IST

మొత్తానికి గ్లామర్ భామ శృతి హాసన్ వ్యవహారం చూస్తుంటే .. సినిమాలకు పులిస్టాప్ పెట్టేలా కనిపిస్తుంది. ఈ మధ్య ఎన్ని అవకాశాలు వస్తున్నా కూడా నో చెబుతుంది. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న శబాష్ నాయుడు సినిమా ఒక్కటే చేసింది. దాదాపు ఏడాది కాలంగా కాలిగా ఉంటున్న ఈ అమ్మడు ఈ విషయం పై స్పందిస్తూ .. ఈ మధ్య సినిమాలు చేయడం లేదని అందరు అడుగుతున్నారు .. దానికి సమాధానం ఒక్కటే .. నా జీవితంలో సినిమాలే కాదు వేరే పనులు చాలా ఉన్నాయి. అందులో సినిమాలు ఒక భాగం మాత్రమే అంటూ చెప్పింది. ప్రస్తుతం శృతి హాసన్ ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేసే పనిలో బిజీగా మారింది. దాంతో పాటు ఓ విదేశీయుడితో జోరు ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ ఇక ముందైనా సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments