ప్రధాని మోదీకి సలహా ఇచ్చే స్దాయికి కేటీఆర్ ఎదగలేదు – ఎంపీ అర్వింద్

Tuesday, June 8th, 2021, 09:05:20 PM IST


తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీరియస్ కామెంట్స్ చేశారు. వ్యాక్సిన్‌పై కేటీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, వ్యాక్సినేషన్‌లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ముందు కేటీఆర్ నిజాలు చెప్పడం నేర్చుకోవాలని అన్నారు. దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా 17.8 శాతం వ్యాక్సిన్ వృధా అవుతుందంటనే వ్యాక్సిన్ పంపిణీ రాష్ట్రంలో ఏ విధంగా కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

అయితే మార్చి 31 వరకు రాష్ట్రానికి 40 లక్షల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేస్తే కేవలం 12 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. వ్యాక్సిన్ మొదలైనప్పటి నుంచి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని, ప్రధాని మోదీకి సలహా ఇచ్చే స్దాయికి కేటీఆర్ ఇంకా ఎదగలేదని మండిపడ్డారు.