బాబోయ్..ఏపీ బిజెపి ఎంపీ కేంద్రాన్ని కోరిన కోరిక ఏంటో తెలుసా..!

Wednesday, January 17th, 2018, 02:40:41 AM IST

బిజెపి ఎంపీ హరిబాబు కేంద్రప్రభుత్వాన్ని కోరిన కోరిక ఏంటో తెలిస్తే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరమైన నవ్వి ఊరుకుంటారు. ఇంతకీ ఆయన కోరిన కోరిక ఏంటంటే ఆంద్రప్రదేశ్ కు సపరేటు గవర్నర్ ని నియమించాలంట. దీని కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆయన అధికారికంగా లేఖ కూడా రాసేశారు. ఇంతకీ ఇక్కడ నవ్వోచేంత మ్యాటర్ ఏముందనేగా డౌటు వివరాల్లోకి వెళదాం..

నిక్కచ్చిగా మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కదానిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ప్రత్యేక హోదా లేదు, నిధులు గుజరాత్ కు సరిపోగా మిగిలిన మెతుకులు విదిల్చినట్లు విదిలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అతి గతి అర్థం కావడం లేదు. రైల్వే జోన్ లేదు. లోటు బడ్జెట్ మ్యాటరే పూర్తిగా మరచిపోయినట్లు ఉన్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే ఏపీ ఎంపీలం కేంద్రం వద్ద కరివేపాకుల్లా మారిపోయారు. అది నిజమే అనిపిస్తుంది. సీఎం ఢిల్లీకి క్యూలు కట్టాల్సిందే తప్ప ఇంత వరకు ఏపీ ప్రజలకు ఒరిగింది లేదు. అర్థరాత్రి హడావిడిగా స్పెషల్ ప్యాకేజి ఇస్తామంటూ అరుణ్ జైట్లీగారు ప్రకటన చేసిన తేదీ కూడా ప్రజలు మరచిపోయి చాలా కాలం అవుతోంది. ఇన్ని సమస్యలు ఉండగా బిజెపి ఎంపీ హరిబాబు గారికి ఏపీకి సపరేటు గవర్నర్ లేకపోవడమే పెద్ద సమస్యగా కనిపిస్తుందేమో !!