అన్నా క్యాంటీన్లు ఉండి ఉంటే పేదలకు ఈ దుస్తితి దాపురించేది కాదు – కేశినేని నాని

Tuesday, March 24th, 2020, 05:05:02 PM IST

కరోనా వైరస్ మహమ్మారి వలన రోజువారీ పనులకు వెళ్లే కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. అయితే ఈ వైరస్ కారణం గా పలువురి కి ఆహారం కొరత ఏర్పడింది. పేదలు ఆహారం అందక ఇబ్బందులు పడే పరిస్తితి ఏర్పడింది. అయితే విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అనాధలకు, పని లేని వారికి ఆహారాన్ని పంచుతున్న వీడియో పై విజయవాడ నియోజక వర్గం ఎంపీ కేశినేని నాని స్పందించారు.

కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందూ వెనుకా ఆలోచించకుండా అన్నా క్యాంటీన్ లను మూసి వేశారు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే పేదలకు ఈ దుస్తితి దాపురించింది కాదు అని, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నాణ్యమైన భోజనం వారికి లభించేది అని వ్యాఖ్యానించారు పాలకులు ఒక చిన్నపని చేసినా దానివల్ల వచ్చే పరిణామాలు వంద సార్లు బేరీజు వేసుకొని చేయాలి జగన్ అని దుయ్యబట్టారు.