సీఎం కేసీఆర్‌కి ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ.. ఆ శుభవార్త ఏదీ?

Sunday, July 26th, 2020, 01:21:22 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మొన్న కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం నాడు రైతులకు త్వరలోనే శుభవార్త అందిస్తానని సీఎం కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు.

అయితే కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం జరిగి దాదాపు రెండు నెలలు గడిచిపోయిందని, మరీ రైతులకు ఇచ్చిన హామీ, ఆ శుభవార్త ఏమయ్యింది అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. మీరు చేసిన 25 వేల రుణమాఫీ వారి వడ్డీలకే సరిపోలేదని, మిగతా బోగస్ హామీలల కాకుండా వెంటనే రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేదంటే రైతులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.