సీఎం జగన్‌కు అల్టీమేట్ సజేషన్ ఇచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు..!

Thursday, July 30th, 2020, 02:11:08 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గత కొద్ది రోజులుగా అధికార వైసీపీ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన విమర్శలతో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్న రఘురామ కృష్ణంరాజు తాజాగా సీఎం జగన్‌కి ఓ అల్టీమేట్ సజేషన్ ఇచ్చారు.

అయితే జగన్ ప్రతిపాదించిన ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను కాదని మాతృభాషలోనే విద్యా బోధన చేయడం మంచిదని సూచించారు. తాజాగా కేంద్రం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడంతో దీనిపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు మాతృభాషలో విద్యా బోధన ఎంతో అవసరమని, మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలని ఎవరైనా సూచిస్తే, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని సీఎం జగన్‌ ఎదురు ప్రశ్నలు వేయడం సరి కాదని అన్నారు. చిన్న రాష్ట్రాలు కూడా మాతృభాషకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రపంచమంతా ఒక దారి, నాదో దారి అని సీఎం అనుకోవద్దని అన్నారు. ఇప్పటికైనా ఆంగ్ల మాధ్యమం ప్రతిపాదనను ఉపసంహరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించాడు.