ప్రధాని కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ…ఎందుకంటే!?

Friday, July 10th, 2020, 12:01:14 AM IST


వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోడీ కు లేఖ రాశారు. అయితే ప్రధాని కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ లేఖ రాశారు. భారత దేశంలో ఉన్న 81 కోట్ల పేద ప్రజల ఆకలి తీర్చినందుకు గానూ ధన్యవాదాలు తెలిపారు.అంతేకాక వ్యవసాయ రంగానికి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు. లక్ష కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించడం అభినందనీయం అని వ్యాఖ్యానించారు. పీఎం ఆవాస్ యోజన మరియు పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆవాస యోజన పథకం ద్వారా వలస కూలీలకు అండగా నిలిచారు అని, గరిబ్ కళ్యాణ్ ను నవంబర్ వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టు ను ఆశ్రయించడం, కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించడం తో రాష్ట్ర ప్రజలు సర్వత్రా చర్చ లు జరుపుతున్నారు.