జీతాలు – ఉచితాలు ఏవి ముఖ్యమో ప్రజలు గమనించాలి – ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Sunday, April 4th, 2021, 06:09:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై, వైసీపీ ప్రభుత్వం విధానాల పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరచూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పాలనా విధానం లో లోపాలు ఉన్నాయి అంటూ ఎత్తి చూపిస్తూ సమయం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే మరొకసారి ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్తితి లో ప్రభుత్వం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పించన్ దారులకు కూడా ఎదురు చూపులు తప్పడం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఒక వీడియో సందేశం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ సొమ్ము ను పప్పు బెల్లాలుగా పంచి పెడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అమలు చేస్తున్న పథకాల పై సైతం గట్టి సెటైర్స్ వేశారు. జీతాలు ఉచితాలు ఏవి ముఖ్యమో ప్రజలు గమనించాలి అంటూ సూచించారు. అయితే రాష్ట్రం ఆర్దికంగా కుప్ప కూలే పరిస్థితి ఎంతో దూరంలో లేదు అని వ్యాఖ్యానించారు.