సీఎం జగన్ పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

Friday, April 30th, 2021, 04:45:07 PM IST

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే మునుపటి కంటే వేగంగా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ కూడా లక్షల్లో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్టే విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు. పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి, అక్కడికి చేరుకునేందుకు బస్సు, ఆటో నో పట్టుకొని రావాల్సిందే గా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఎందుకు చొరవ చూపుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియంతలా వ్యవహరించడం సీఎం జగన్ మోహన్ రెడ్డి కి తగదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులను తగ్గించి చూపొద్దు అంటూ మండిపడ్డారు. అయితే పరీక్షలు వాయిదా పడతాయి అన్న విశ్వాసం తనకు ఉంది అంటూ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే పలు పార్టీలు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ను వ్యతిరేకిస్తున్నాయి.