వారిద్దరూ కలిసి నాపై కుట్ర చేస్తున్నారు – రఘురామ కృష్ణంరాజు

Tuesday, March 2nd, 2021, 09:53:30 AM IST

వైసీపీ లో ఉంటూనే రెబల్ అభ్యర్థిగా మారిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరొకసారి వైసీపీ నేతల పై సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ గా తన నియోజక వర్గం పర్యటనకు వెళ్ళాలి అనుకుంటే తనను అడ్డుకుంటున్నారు అని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. హిందూ దళితులు, క్రైస్తవ దళితుల మధ్య చిచ్చు రాజేస్తున్నానని ఒకే రోజు ఒకే సమయం లో తన పై పది కేసులు మోపారు అని వ్యాఖ్యానించారు.క్రైస్తవం లో దళితులు ఉండరు అని వ్యాఖ్యానించారు. అయితే రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరితే తన పై కేసులు మోపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ముఖ్యమంత్రి బాబాయ్, జిల్లా మంత్రి రంగనాథ్ రాజు కలిసి తన పై కుట్ర చేస్తున్నారు అంటూ రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కుట్ర లో తాడేపల్లి పెద్దలు ఉన్నారు అనే అనుమానం కలుగుతుంది అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే తన పై తప్పుడు కేసులు పెట్టిన వారి పై సభాపతి కి ఫిర్యాదు చేశానని, వారికి ప్రివిలైజ్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. అయితే ఒక కులానికి అనుకూలంగా మాట్లాడినందున ఏయూ ఉప కులపతి ను ఆ పదవి నుండి తొలగించాలని గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు. అయితే టీటీడీ చైర్మన్ తన సిఫారసు లను తిరస్కరిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఎంపీ గా తనకు ఉన్న హక్కులను కాలరాయడానికి టీటీడీ చైర్మన్ ఎవరు అంటూ సూటిగా ప్రశ్నించారు.అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తన పై కొనసాగుతున్న కుట్రల గురించి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి కి తీసుకెళ్తా అని చెప్పుకొచ్చారు.