సీఎం జగన్ కి రఘురామ మరొక లేఖ…ఎందుకంటే?

Friday, June 11th, 2021, 09:45:37 AM IST

MP-Raghurama-Krishnam-Raju

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరొక లేఖ రాశారు. సీపీఎస్ విధానం రద్దు హామీని నిలబెట్టుకోవాలని లేఖ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన పింఛన్ హామీని నెరవేర్చాలని లేఖ రాసిన రఘురామ మరొక లేఖ రాయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అయితే సీఎం జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటి పై మాట్లాడటం తో రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ నేతలు సైతం వరుస విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష పార్టీ గా ఉన్నప్పుడు పాదయాత్ర లో పలు హామీలు ఇచ్చారు. అందులో కీలకం అయినది ఈ సిపిఎస్ విధానం రద్దు. అయితే దీని పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇంకా పాత విధానాన్ని సీఎం జగన్ కొనసాగిస్తున్నారు అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ లో ప్రస్తావించారు. అయితే జగన్ ఇచ్చిన సిపిఎస్ విధానం రద్దు వలన ఎన్నికల సమయం లో ఉద్యోగుల నుండి మద్దతు లభించింది అని వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చిన 7 రోజుల్లోనే హామీ నెరవేరుస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ లో డిమాండ్ చేయడం జరిగింది. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.