అన్ని రాష్ట్రాల సీఎంలకు ఎంపీ రఘురామ లేఖ.. ఒక్క జగన్‌కి తప్ప..!

Tuesday, June 8th, 2021, 12:33:11 AM IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఐడీ అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో సీబీఐ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన అరెస్ట్‌ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఇటీవల ఎంపీలందరికి లేఖ రాసిన రఘురామ ఓ ఎంపీ అయిన తనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని కోరిన సంగతి కూడా మనందరికి తెలుసు.

అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ మినహా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఎంపీ రఘురామ లేఖ రాశారు. పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని రఘురామ లేఖలో ప్రస్తావించారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసినందుకే కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్‌ చేయించారని పార్లమెంట్‌లో తనకు మద్దతిచ్చేలా తమ తమ ఎంపీలకు సూచించాలని సీఎంలను కోరారు. తనపై పెట్టిన రాజద్రోహం సెక్షన్‌ను తొలగించి అసెంబ్లీల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.