తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఓ పెద్ద తప్పు చేశారని దానిని బయటపెడతానని ఇటీవల బండి సంజయ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడంపై నేను రిటన్ కంప్లైంట్ ఇస్తానని చర్యలు తీసుకునే దమ్ము బీజేపీకి ఉందా అని నిలదీశారు.
అంతేకాదు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌కు హాజరు కాకుండా, హాజరు పట్టికలో కేసీఆర్‌కు బదులు మరోకరితో సంతకాలు చేయించారని ఆరోపణలు చేశారు. అయితే అసలు కేసీఆర్ పార్లమెంట్‌కు ఎన్నిసార్లు హాజరయ్యారు? ఆ దొంగ సంతకాలు ఏవరివి? బండి సంజయ్ ఫోరెన్సిక్ టెస్ట్ చేపించగలడా? కేసీఆర్ చదువుకుంది బీఏ. కానీ ఎంఏ చదువుకున్నట్లు పార్లమెంట్‌కు సమాచారం ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోగలరా అని ప్రశ్నించారు. అయితే నిజానికి బండి సంజయ్, కేసీఆర్ వేరు కాదని ఇద్దరూ ఒక్కటేనని రేవంత్ రెడ్డి అన్నారు.