సీఎం సీటుకు, కేటీఆర్‌కు ఇదే లింక్.. రేవంత్ రెడ్డి సెటైర్లు..!

Tuesday, January 14th, 2020, 12:45:35 AM IST

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. సీఎం సీటు విషయంలో కేసీఆర్‌కు ఇంటిపోరు పెరిగిందని అన్నారు. అయితే సీఎం సీటు కావాలని రోజు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర పంచాయితీ నడుస్తుందని ఎద్దేవా చేశారు.

అయితే సీఎం కేసీఅర్ సీఎం సీటుకు కేటీఆర్‌కి ఒక లింక్ పెట్టాడని, మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అత్యధిక స్థానాలలో నెగ్గితే సీఎంని చేస్తానని చెప్పాడని అన్నారు. అందుకే కేటీఆర్ తనకు ఈ మున్సిపల్ ఎన్నికలు ఒక పరీక్ష అని పదే పదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ ఆరేళ్ళలో ఏ ఒక్క మున్సిపాలిటీలో మార్పు రాలేదని ఇప్పుడు టీఆర్ఎస్‌కి ఓటు వేసినా ఏమీ మార్పు ఉండదని అన్నారు. తండ్రీ, కొడుకులకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండని అప్పుడే మీ మున్సిపాలిటీలు మారుతాయని పిలుపునిచ్చారు.