కేసీఆర్ పతనం మొదలైంది..రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tuesday, September 10th, 2019, 10:05:03 AM IST

ప్రస్తుతం తెరాస పార్టీ పరిస్థితి చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు ఇబ్బంది పడని విధంగా తెరాస పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ పార్టీలోని సీనియర్ నేతలే డైరెక్ట్ గా కేసీఆర్ తీరుపై మండిపడుతున్నారు. ఈటెల,రసమయి , నాయిని, రాజయ్య , జోగు రామన్న లాంటి నేతలు కేసీఆర్ మీద వ్యతిరేకస్వరం వినిపిస్తున్నారు. జోగు రామన్న అయితే తనకి మంత్రి పదవి రాకపోవటంతో ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

తాజాగా తెరాస పార్టీ పరిస్థితి గురించి కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన అనుచరగణంతో కొన్ని కీలకవ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో తెరాస పరిస్థితి తీసికట్టుగా మారిపోతుంది. సొంత పార్టీలోనే కేసీఆర్ మీద వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికి కేవలం నలుగురైదుగురు మాత్రమే బయటకు వచ్చారు, ఇంకా చాలా మంది నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. వాళ్ళు కూడా కేసీఆర్ మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితులను మనం అనుకూలంగా మలుచుకొని పూర్తిగా తెరాసకి చెక్ పెట్టాలి, అందుకు అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ముందు ఉన్నాడు. అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు . దానికోసమే తనవంతు ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాడు. ఆ కార్యం పూర్తియైన తర్వాత తన దృష్టి మొత్తం తెరాస మీద పెట్టె అవకాశం ఉంది.