బ్రేకింగ్ న్యూస్: అక్కడికి వెళ్లే దమ్ము చంద్రబాబు కి లేదు—వైసీపీ ఎంపీ

Thursday, February 13th, 2020, 11:51:33 AM IST

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏ రాష్ట్రంలో సీఎం ప్రమాణ స్వీకారం ఉన్నా నమ్మకస్తులని పంపి ఇన్విటేషన్ సంపాదించేవాడు అని విజయ సాయి రెడ్డి అన్నారు. ఎన్డీయే లో లేకున్నా ఇపుడు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే దమ్ము చంద్రబాబు కి లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ పెద్దల కంట్లో పడితే పాత కేసులు ఎక్కడ తిరగతోడుతారో అని వణుకుతున్నారు అని అన్నారు. అప్పట్లో గిరగిరా తిప్పిన చక్రాలు ఏమయ్యాయో అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విజయసాయి రెడ్డి ఫై నెటిజన్లు స్పందిస్తున్నారు. చంద్రబాబు లేదా జగన్ వీరిద్దరిలో ఎవరి కోసం ఈ వ్యాఖ్యలు అంటూ ఒకతను ప్రశ్నించారు. మరొక ట్వీట్ లో విజయసాయి రెడ్డి చంద్రబాబు ఫై విమర్శలు చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా లేని రాష్ట్రాన్ని నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడు కిరసనాయిలు అంటూ ఘాటుగా విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్ర సమస్యల గురించి గంటన్నర పాటు ప్రధాని మోడీ తో సమావేశమైతే, పీపీఏ ల ఫై మందలించాడని సైనేడ్ వార్తలు రాశారంటూ కౌంటర్ ఇచ్చారు. చంద్రన్న భజన పరాకాష్టకు చేరిందని విజయసాయి రెడ్డి అన్నారు.