మళ్ళీ నీ బ్రీఫ్ డు అవసరం లేదు…చంద్రబాబు పై విజయసాయి రెడ్డి సెటైర్స్

Tuesday, April 20th, 2021, 02:40:43 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆఫీసులు మూసెయ్యడం తో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420 కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. పైగా కరోనా వలన బర్త్ డే ను ఘనంగా చేయొద్దు అంటూ సందేశం ఇవ్వడం పట్ల ఎద్దేవా చేశారు. అయితే 17 తర్వాత పార్టీ లేదు బొక్కా లేదన్న సందేశాన్ని ఇప్పటికే మీ వాళ్లు పాటిస్తున్నారు లే బాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ మీ బ్రీఫ్ డు అవసరం లేదు అని సెటైర్స్ వేశారు.

అయితే సింహాచలం దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎక్కువ మందిని గంటా సతీమణి చౌదరి మేడం నియమించారంట అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నీ పార్టీ దిగజారడానికి ఇక మెట్లు లేవు అంటూ విమర్శించారు. 2 ఛానళ్ళు, రెండు పేపర్ లలో చూసుకొని మురిసిపోవడమే అంటూ సెటైర్స్ వేశారు. అయితే రాష్ట్రం లో ఇంకా పచ్చ పార్టీ ఉందనే భ్రమ కల్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా బాబూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. విజయసాయి రెడ్డి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతి పక్ష నాయకుడు పుట్టిన రోజున సైతం ఇలా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం పట్ల గట్టి గా కౌంటర్ ఇస్తున్నారు.