ఉమా అడ్డంగా బుక్కయ్యాడు…బాబు మ్యానేజ్ చేయలేక చస్తున్నాడు – వైసీపీ ఎంపీ

Thursday, April 22nd, 2021, 04:22:10 PM IST

Ycp-mp-Vijayasai-reddy
తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ నేతలను ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు చేశారు. అయితే బాబు దొంగల బడిలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లంతా దొరికి పోతున్నారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దోచుకోవాలి కానీ, ఎవిడెన్స్ వదలొద్దు అని, అబద్ధాలు వరదలా పాటించాలి, తర్వాత బుకాయించాలి అని, మార్ఫింగ్ వీడియో లు చూపాలి, నాకేం పాపం తెలియదనాలి అంటూ చంద్రబాబు నాయుడు పై సెటైర్స్ వేశారు. అయితే ఉమా అడ్డంగా బుక్కయ్యాడు, బాబు మ్యానేజ్ చేయలేక చస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి మంత్రి దేవినేని ఉమా అధికార పార్టీ వైసీపీ పై తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయం నుండి పలు అంశాల పై అధికార పార్టీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ సమయం లో దేవినేని ఉమా ఇంట్లో సీఐడీ సోదాలు మరియు మార్ఫింగ్ వీడియో ల ఘటన విషయం లో చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పలువురు మాత్రం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై, పార్టీ నేతల పై వరుస విమర్శలు చేస్తున్నారు.