కోవిడ్ మరణాల పాపం చంద్రబాబుకు తప్పక చుట్టుకుంటుంది – ఎంపీ విజయసాయి రెడ్డి

Sunday, May 16th, 2021, 12:01:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే రాష్ట్రం లో సరైన మౌలిక సదుపాయాలు సైతం లేక కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతూనే ఉంది. అయితే అధికార పార్టీ వైసీపీ పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తున్న క్రమంలో, అధికార పార్టీ కి చెందిన కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. చంద్రబాబు నాయుడు గత పాలనా విధానం పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కోవిడ్ మరణాల పాపం చంద్రబాబుకు తప్పక చుట్టుకుంటుంది అని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాలనలో ఆరోగ్య శ్రీ నిధులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు మళ్ళించాడు అని ఆరోపించారు. ప్రభుత్వం ఆసుపత్రుల అభివృద్ది ను నిర్లక్ష్యం చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ మౌలిక వసతుల కొరత వలనే రోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. గత ప్రభుత్వ పాలన పట్ల విమర్శలు ఆపి, ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు ప్రజలకు సహాయం చేయండి అంటూ విమర్శించారు. అధికారం లోకి వచ్చి ఇన్నేళ్ళు అయినా ఇంకా ప్రతి పక్ష పార్టీ నేతల పై విమర్శలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం టీడీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.