ఇంత నీచానికి ఇంకెవరూ దిగరు – ఎంపీ విజయసాయి రెడ్డి

Tuesday, June 8th, 2021, 02:30:58 PM IST


తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా కరోనా ఔషధాలు ఇచ్చే ఆనందయ్య మీద కూడా చంద్రబాబు నాయుడు పగ బట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తన బుట్టలో పడలేదు అని, స్వతంత్రంగా మందు పంపిణీ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అన్న అక్కసు తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను దుషిస్తున్నాడు అని వ్యాఖ్యానించారు. శవాల పై పేలాలు ఏరుకొనే పేటెంట్ నీదే బాబు అంటూ విమర్శించారు. ఇంత నీచానికి ఇంకెవరూ దిగరు అంటూ చెప్పుకొచ్చారు. అయితే మరొక ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల నుద్దేశిస్తూ సెటైర్స్ వేశారు.

గతం లో అధికార పార్టీ వైసీపీ పై టీకాల విషయం లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల ను గుర్తు చేశారు. లేఖలు రాస్తే టీకాలు ఇస్తారా అంటూ ప్రశ్నించిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. అదే తరహాలో టీకాల బాధ్యత కేంద్రానిదే అంటూ మోడీ చేసిన వ్యాఖ్యల ను పోస్ట్ చేశారు. దీనికి కౌంటర్ గా ప్రశ్న, జవాబు రెండూ పచ్చ మీడియా లో వస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.