చంద్రబాబు, లోకేష్ లపై విజయసాయి రెడ్డి సెటైర్స్

Monday, April 5th, 2021, 04:12:18 PM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో అధికార పార్టీ వైసీపీ కి మరియు ప్రతి పక్ష పార్టీ లు అయిన టీడీపీ, బీజేపీ ల కి మధ్య వరుస విమర్శల యుద్ధం నడుస్తోంది. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పనబాక లక్ష్మి ను గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గుతాయి అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు చేశారు. అంతేకాక గతం లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల ను సైతం పోస్ట్ చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యం లో పది డిగ్రీల ఉష్ణోగ్రత లను తగ్గించాలి అంటూ అధికారులను ఆదేశిస్తూ చేసిన వ్యాఖ్యల ను సైతం పోస్ట్ చేశారు. చివరగా వాళ్ళను అలా వదిలేయకండి, ఎవరికైనా చూపించండి అంటూ సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తుండగా, మరి కొందరు మాత్రం టీడీపీ పై విమర్శలు చేస్తున్నారు.