ప్రతిదీ జగన్ గారి ప్రభుత్వ వైఫల్యం గా చిత్రించి ఉన్మాదుల్లా ఆనందిస్తున్నారు – విజయసాయి రెడ్డి

Friday, April 30th, 2021, 12:26:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల పై తెలుగు దేశం పార్టీ అదినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లు ఇద్దరూ కూడా తరచూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం లో పలు సమస్యల పై ప్రస్తావిస్తూ జగన్ పాలనా విధానం పై వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే పలు విమర్శలకు సమాధానం గా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు గా జవాబు ఇచ్చారు. టీవీల్లో కనిపించే సామూహిక శవ దహనాలు, ఆక్సిజన్ లేక సొమ్మసిల్లిన రోగుల దృశ్యాలు మన రాష్ట్రంలోని వి కావని ఆ తండ్రీ కొడుకులకు బాగా తెలుసు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇంకో రాష్ట్రాన్ని వేలెత్తి చూపే దైర్యం లేక ప్రతిదీ జగన్ గారి ప్రభుత్వం వైఫల్యం గా చిత్రించి ఉన్మాదుల్లా ఆనందిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మద్దతు ఇస్తూ టీడీపీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం రాష్ట్రం లో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ వైసీపీ తీరును ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.