లోకేష్, చంద్రబాబు లకు సై రా పంచ్..!

Tuesday, May 4th, 2021, 04:06:01 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతి రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా వైరస్ మరణాలు రాష్ట్రం లో నమోదు అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం పై అధికార పార్టీ వైసీపీ పై టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్న నేపథ్యం లో వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

కరోనా వైరస్ మరణాలకు జగన్ దే బాధ్యత అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు మరియు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల పై సెటైర్స్ వేశారు. ముందు ఎన్నికలు తర్వాతే వాక్సిన్ అంటూ చంద్రబాబు నాయుడు చేసినట్లు గా తెలిపారు. అదే తరహాలో సెకండ్ వేవ్ లేదు ఎన్నికలు పెడతా అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసినట్లు గా తెలిపారు. అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం గా ఆ మాట మీ నాన్నారి కళ్ళల్లో, నిమ్మగడ్డ కళ్ళల్లో చూసి చెప్పు అంటూ విమర్శించారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఎంపీ విజయసాయి రెడ్డి తీరును సమర్ధిస్తూ టీడీపీ పై విమర్శలు చేస్తుండగా, మరి కొందరు మాత్రం జగన్ పాలనా విధానం పై, విజయసాయి రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.