స్థానిక సంస్థలకి 2018 లోనే ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డ పట్టించుకోలేదు అంటూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 లో ఆఖరి సారి ఎన్నికలు జరిగాయి అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. రెండున్నరేళ్లుగా బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమ్మగడ్డ నిద్రపోయాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ టైమ్ లో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే మరోక ట్వీట్ లో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఇన్నాళ్లు కరోనా భయంతో పక్క రాష్ట్రంలో దాక్కున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల పై దండెత్తడానికి వస్తారు అంటూ విమర్శించారు. వలస పక్షుల్లా గా ఏడాదికి ఒకసారి వచ్చి కలిసి మెలిసి జీవిస్తున్న వారి మధ్య కలహాలు పెడతారు అంటూ వరుస విమర్శలు చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తరిమి కొట్టాలని ప్రజలకు సూచించారు. అయితే వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు మద్దతు ఇస్తుండగా మరి కొందరు మాత్రం వైసీపీ తీరును ఎండగడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని 2018లోనే హైకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డ పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఆఖరిసారి ఎన్నికలు జరిగాయి. రెండున్నరేళ్లుగా బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమగడ్డ నిద్రపోయాడు. ఇప్పుడు కరోనా టైంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2021