రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి పాపం నిమ్మగడ్డదే – విజయసాయి రెడ్డి

Wednesday, April 28th, 2021, 07:45:35 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణాలు సైతం భారీగా నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కి కారణం నిమ్మగడ్డ అంటూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి పాపం నిమ్మగడ్డ దే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కట్టప్ప గా మారిన నిమ్మగడ్డ, శాడిస్టు బాబు కోసం కోర్టు కి వెళ్లి మరీ ఎలక్షన్లు పెట్టించాడు అంటూ ఆరోపించారు. అయితే మద్రాసు హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డ నూ బుక్ చేయాలి అంటూ విమర్శించారు. అయితే కోవిడ్ తో చనిపోయిన ప్రతి ఒక్కరి ఉసురు బానిసకు, బాసుకు తగిలి తీరుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఈ నేపథ్యం లో ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు వైసీపీ అభిమానులు టీడీపీ వ్యవహరించిన తీరు పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం అధికార పార్టీ వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.