అచ్చెన్న నాయకత్వం వహిస్తాడా తిరుగుబాటుకు? – ఎంపీ విజయసాయి రెడ్డి

Wednesday, June 9th, 2021, 11:50:01 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో టీడీపీ అధికారం కోల్పోయిన అనంతరం నుండి రాష్ట్రం లో అధికార పార్టీ వైసీపీ లోకి చేరికలు మరింత పెరిగాయి. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం లో టీడీపీ పుంజుకోవడం లేదు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అధికార తెరాస లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా టీడీపీ ప్రస్తుత పరిస్థితుల పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు తెరాస లోకి జంప్ అట అంటూ సెటైర్స్ వేశారు. ఇక్కడ కూడా అలాంటి గందరగోళమే ఉందని అన్నారు. అయితే జూమ్ మీటింగ్ లతో పిచ్చెక్కి పోయిన నేతలు కఠిన నిర్ణయం తీసుకోకపోతే తమ ఫ్యూచర్ నాశనం అవుతుందని టెన్షన్ పడుతున్నారు అంట అంటూ విమర్శించారు. అచ్చన్న నాయకత్వం వహిస్తాడా తిరుగుబాటు కు అంటూ విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యల పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.