చెప్పాడంటే.. చేస్తాడంతే.. జగన్ పాలనపై విజయసాయి కామెంట్స్..!

Sunday, May 31st, 2020, 01:01:13 AM IST

ఏపీ సీఎంగా జగన్ అధికారాన్ని చేపట్టి ఏడాది గడిచిపోయింది. అయితే జగన్ ఏడాది పాలనను గుర్తు చేసుకున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ ప్రయోజనం అందింది. ‘చెప్పాడంటే.. చేస్తాడంతే’ అనే మాట పాపులర్ సినిమా డైలాగ్ లాగా ప్రతి ఒక్కరి నోట నానుతోంది.

అయితే హామీల అమలుకు యువ సీఎం పడిన శ్రమను మాటలతో వర్ణించలేమని అన్నారు. అంతేకాదు తనెంత ప్రజాపక్షపాతో ఏడాదిలోనే నిరూపించుకున్నారు సీఎం జగన్ గారు. తమ కుటుంబ సభ్యుడే ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నాడని ప్రజలు ధీమాగా ఉంటే, ఎన్నడూ లేనంత స్వేచ్ఛగా అధికార యంత్రాంగం పనిచేస్తోంది. మోటివేట్ చేసే లీడర్ దొరికాడని ఉద్యోగులు గర్వపడుతున్నారని అన్నారు.