బాబు హయాంలో ప్రతీది వ్యాపారమే.. విజయసాయిరెడ్డి అల్టీమేట్ కామెంట్స్..!

Saturday, July 4th, 2020, 02:04:32 AM IST


టీడీపీ అధినేత, మాజీ సీఎంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బాబు హయాంలో ప్రతిదీ వ్యాపారమే అని నాకేమొస్తుంది, నావాళ్లకేం లాభం అనేదే ఆయన గారిలో ఆలోచనగా ఉండేదని అన్నారు.

అయితే హాస్పిటళ్లలో శానిటేషన్ కాంట్రాక్టుల నుంచి మందుల సరఫరాల వరకు అంతా తన వాళ్లే దోచుకునేలా నిర్ణయాలు ఉండేవని ఆరోపించారు. జగన్ గారి రివర్స్ టెండర్ల విధానం వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా పారదర్శకమే అని ప్రతి రూపాయికి లెక్క తెలుస్తోందని చెప్పుకొచ్చారు.