ధోనీ తల్లిదండ్రులకు సోకిన కరోనా

Wednesday, April 21st, 2021, 02:02:39 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ ఉంటుంది అని మళ్ళీ భావించినప్పటికీ, రాత్రి కర్ఫ్యూ మరియు కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచి పెట్టడం లేదు. అయితే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబీకులకు కరోనా వైరస్ సోకింది. ధోనీ తల్లి దేవకీ దేవి, తండ్రి పాన్ సింగ్ కోవిడ్ భారిన పడ్డారు. అయితే తాజాగా జరిపిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో వీరికి పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వీరు రాంచీ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.