టీమిండియా.. నెం.1

Saturday, July 13th, 2013, 07:09:42 PM IST


ప్రపంచ చాంపియన్‌ భారత్‌ వన్డేల్లో తన అగ్రస్థానాన్ని నిలభెట్టుకుంది.ధోనీ సేన చాంపియన్‌ ట్రోఫీతో పాటు కరీబియన్‌ గడ్డపై ముక్కోణపు సిరీస్‌ విజేతగా నిలవడంతో తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ లో నెంబర్‌.1ను కాపాడుకుంది. భారత్ మొత్తం 122 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ,ఆస్ట్రేలియా 114 పాయింట్లతో ద్వితీయ, ఇంగ్లాండ్ 112 పాయింట్లతో తృతీయ స్థానాలు ఆక్రమించాయి. స్వదేశం లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌ను భారత్‌ 3-2తో ఓడించి నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. వనే్డ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎబి డివిలియర్స్, హషీం ఆమ్లా మొదటి రెండు స్థానాలలో కొనసాగుతున్నరు. బౌలింగ్, ఆల్‌రౌండర్స్ విభాగాల్లో ‘టాప్-10’ జాబితాలో మన దేశం తరఫున రవీంద్ర జడేజా ఒక్కడే స్థానాన్ని సంపాదించాడు. అతను ఈ రెండు విభాగాల్లోనూ ఐదో స్థానంలో ఉన్నాడు.