చంద్రబాబుకు అల్టీమేట్ ప్రశ్న.. ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ..!

Tuesday, January 14th, 2020, 08:21:30 AM IST

టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అల్టీమేట్ ప్రశ్న వేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసిందని మీరు కాదా అని అడిగారు.

అయితే గతంలో కాపుల హక్కుల కోసం మేము ఉద్యమం చేపడితే తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది నిజం కాదా అని అన్నారు. అయితే ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనకు మీరు నిజంగానే మద్ధతు తెలుపుతున్నారా, లేక మీ కులం కోసమే ఉద్యమం చేస్తున్నారా అని నిలదీశారు. మీ హయాంలో చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారామ అని మండిపడుతూ లేఖ రాశారు.