పవన్ కళ్యాణ్ కి సెటైర్ లు వేసిన ముద్రగడ

Sunday, February 26th, 2017, 11:33:19 AM IST


ఇవాళ ఉదయం కాపులకి సపోర్ట్ గా వారిని బీసీలలో చేర్చాలి అనే డిమాండ్ తో కర్నూలు లో సత్యాగ్రహ దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇవాళ సాయంత్రం వరకూ ఈ దీక్ష ని చెయ్యడానికి నిశ్చయించుకున్నట్టు చెప్పారు. ముద్రగడ పద్మనాభం ఈ సందర్భంగా కాపులని బీసీల్లో చేర్చే అంశం ఇక మీదట స్ట్రాంగ్ గా నడుస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక హోదాగురించి కూడా మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి జనాలని మోసం చేస్తున్నాయి అన్నారు ఆయన. అదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. ట్వీట్లు చేయడం సభలు పెట్టడంతో ప్రత్యేక హోదా రాదని ముద్రగడ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముందుకొచ్చే పార్టీలు వ్యక్తులతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాడతామంటున్న వ్యక్తులు రాజకీయ పార్టీలు ఒకే గొడుగు కిందకి రావాలని ముద్రగడ కోరారు.