వెయ్యి కోట్లతో ముకేశ్ అంబానీ మహాభారతం?

Wednesday, March 21st, 2018, 05:29:09 PM IST

మహాభారతం లో ఒక సినిమాలో ఉండవలసిన ప్రధాన అంశాలన్నీ ఉంటాయనేది ఆ కథ గురించి తెలిసినవారికి అసలు చరిత్ర బాగానే తెలిసి ఉంటుంది. అయితే ఇండియాలో అత్యధిక జనాభాకు తెలిసిన ఈ కథను ఏ ఇండస్ట్రీవారు తెరకెక్కిస్తారు అనేది ప్రధానాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి కథ పై మనసు పారేసుకున్న సంగతి తెలిసిందే. పలు ఇంటర్వ్యూలలోనే జక్కన్న
తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతమే అని చెప్పారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ కూడా మహాభారతంపై కన్నేశాడు. గతంలోనే చాలా సార్లు ఆయన మహాభారతం కథ వస్తే వెంటనే ఓకే చేస్తానని చెప్పాడు. అయితే దర్శకుడు ఎవరనే విషయమం ఫైనల్ కాలేదు కానీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇక సినిమాను నిర్మించబోయే వ్యక్తి ఎవరో కాదు. ఇండియన్ సంపన్నులలో ఒకరైన ముకేశ్ అంబానీ. ఆయన సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. దాదాపు 1000 కోట్ల వరకు ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయనున్నారని సమాచారం. ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ మహాభారతతంలో అర్జునుడి పాత్రకు సెట్ అయినట్లు సమాచారం. మరి సినిమా అనుకున్నంత లెవెల్లో హిట్ అవుతుందో లేదో చూడాలి .