వెనక్కి తగ్గిన ములాయం.. అఖిలేష్ పై నిషేధం ఎత్తివేత…?

Sunday, January 1st, 2017, 01:08:25 AM IST

muyam
ఉత్తరప్రదేశ్ ను ఒక ఊపు ఊపిన రాజకీయ తుఫాన్ ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ పరిస్థితులన్నీ చక్కబడ్డట్టే కనిపిస్తున్నాయి. ములాయం సింగ్ యాదవ్ కొడుకు, ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ దెబ్బకి ఆ వృద్ధ నేత తట్టుకోలేక వెనక్కి తగ్గారు. శుక్రవారం అఖిలేశ యాదవ్ ను, రాంగోపాల్ యాదవ్ లను సమాజ్ వాది పార్టీ నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహించిన అఖిలేష్ శుక్రవారం నుండి తండ్రికి తన విశ్వరూపం చూపించారు. అఖిలేష్ ను పార్టీ నుండి బహిష్కరించినప్పటి నుండి ఆ రాష్ట్రంలో రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులలో బహిష్కరణకు గురైన అఖిలేష్ శనివారం తన నివాసంలో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయగా 229 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఇదిలా ఉండగా సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం అఖిలేష్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్న ఆజాంఖాన్ పార్టీని మళ్ళీ ఏక తాటిపై నిలిపేందుకు మధ్యవర్తిత్వం చేశారు. తండ్రి, కొడుకులు కలిసి కూర్చుని ఎస్పీ లో తలెత్తిన సంక్షోభానికి పరిష్కారం చూడాలని చెప్పారు. ములాయం సింగ్ ను ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ ను తన ఇంటికి పిలిచి మాట్లాడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ములాయం శుక్రవారం అఖిలేష్, రాంపాల్ యాదవ్ లను పార్టీ నుండి ఆరు సంవత్సరాలు బహిష్కరించి…. తెల్లవారేసరికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ రెండు రోజుల్లో జరిగిన సంఘటనలతో పార్టీ పరువు పోయింది.

  •  
  •  
  •  
  •  

Comments