అది ఇప్పుడు అవసరమా.. కేసీఆర్ సర్కార్‌ను నిలదీసిన ఎమ్మెల్యే సీతక్క..!

Wednesday, July 22nd, 2020, 02:10:30 PM IST

కేసీఆర్ సర్కార్‌పై ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, సరైన వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పుతుంటే సీఎం కేసీఆర్ నిద్రపోతున్నారా అని నిలదీశారు.

అయితే ప్రస్తుత పరిస్థితులలో కొత్త సచివాలయ నిర్మాణం ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించారు. నేడు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ వార్డును పరిశీలించిన సీతక్క రోగులకు అందుతున్న సేవలను గురుంచి అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో సిబ్బంది కొరత, సరైన పరికరాలు లేవని దీంతో డాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా బాధితులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.